నాణ్యమైన విద్య అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
👉 విద్యార్థినీలకు యూనిఫామ్ అందజేత
మిర్యాలగూడ జులై 30 (మనోరంజని తెలుగు టైమ్స్)
విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (బిఎల్ఆర్) అన్నారు.
మిర్యాలగూడ మండలం శ్రీనివాస్ నగర్‌లోని ఎంజేపీటీ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గర్ల్స్ స్కూల్ ను సోమవారం
మండల విద్యాశాఖ అధికారి ధర్మానాయక్ తో కలిసి బాలికల గురుకుల పాఠశాలను సందర్శించారు. పాఠశాల ఆవరణ, తరగతి గదులు, మౌలిక వసతులు,విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు, పరిసరాల పరిశుభ్రతను ఎమ్మెల్యేపరిశీలించారు.అనంతరంఉపాధ్యాయులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి టీచర్స్ రిజిస్టర్‌ను పరిశీలించారు.పాఠశాలలో అవసరమైన మౌలిక వసతులు, విద్యా బోధన, సిబ్బంది సమస్యలు, ఇతర అవసరాల గురించి ఉపాధ్యాయులను అడిగి తెలుసుకుని, సంబంధితఅధికారులకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.తదుపరి విద్యార్థులతోముఖాముఖి సమావేశమై వారి విద్యాభ్యాసం, హాస్టల్ వసతులు, ఆహారం, తాగునీరు, పరిశుభ్రత, ఇతర సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులుతలెత్తకుండా అన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని భరోసా ఇచ్చారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం రాష్ట్రంలో విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు.ప్రభుత్వ పాఠశాలలు,గురుకులాల్లో విద్యా ప్రమాణాలను మరింతమెరుగుపరిచేందుకు ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షణ చేపడుతోందన్నారు.
ఆగస్టు 15వ తేదీ వరకు ప్రతిరోజూ మిర్యాలగూడ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలను సందర్శించి అక్కడి పరిస్థితులను స్వయంగా పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటానన్నారు.
అనంతరం రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న యూనిఫామ్‌లను విద్యార్థులకు పంపిణీ చేసి, ప్రభుత్వం కల్పిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత విద్యను అభ్యసించి జీవితంలో ఉన్నత శిఖరాలనుఅధిరోహించాలనిఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో బాలికల గురుకుల ప్రిన్సిపాల్ అనుకరణ, పాఠశాలఉపాధ్యాయులు,తదితరులు పాల్గొన్నారు.












