Nirmal/Mamda (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 30
నెరడిగొండ మండలంలోని పెద్ద బుగ్గరం ప్రభుత్వ గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల, కళాశాలలో ఏర్పాటు చేసిన డిజిటల్ ప్యానెల్లు, నూతన తరగతి గదులను బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతోందని పేర్కొన్నారు.
నెరడిగొండ మండలంలోని పెద్ద బుగ్గరం ప్రభుత్వ గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల, కళాశాలలో ఏర్పాటు చేసిన డిజిటల్ ప్యానెల్లు, నూతన తరగతి గదులను బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గురువారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతోందని అన్నారు. విద్యార్థులు చదువులోనే కాకుండా క్రీడల్లో కూడా ప్రతిభ కనబర్చి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.
పాఠశాలకు రాకపోకలు సులభంగా ఉండేలా ప్రత్యేకంగా సీసీ రహదారి నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అలాగే విద్యార్థుల అభ్యర్థన మేరకు డైనింగ్ హాల్‌తో పాటు పాఠశాల ఆవరణలోనే ఆధునిక తాగునీటి శుద్ధి కేంద్రం (వాటర్ ప్లాంట్) ఏర్పాటు చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.












