నిర్మల్, జులై 17
2027లేపజననపూనేఉపధులబలీలు,పమషనలపచేపడమనసపషటంచేు.ఈసంసంలబలీలుఉండబనెలపు.
ఈ విద్యా సంవత్సరంలో ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ ఉండబోదని, 2027లో జరిగే దేశవ్యాప్త జనగణన పూర్తయిన తర్వాతే వీటిని చేపడతామని విద్యాశాఖ సెక్రెటరీ యోగితా రాణా స్పష్టం చేశారు.
గురువారం సచివాలయంలో కొందరు ఉపాధ్యాయ సంఘాల నేతలు టీచర్ల బదిలీలు చేపట్టాలని విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణాను కలిశారు. టీచర్లకు నిర్వహించే టెట్ (Teacher Eligibility Test)ను ఆన్లైన్ విధానంలో కాకుండా మాన్యువల్‌గానే నిర్వహించాలని వారు కోరారు.
బోధించే సబ్జెక్టులకు అనుగుణంగానే టెట్ ఉండాలని, అర్హత మార్కులను తగ్గించాలని ఉపాధ్యాయ సంఘాలు విజ్ఞప్తి చేశాయి. దీనిపై ఆమె స్పందిస్తూ.. ఇప్పట్లో బదిలీలు ఉండవని, జనగణన ముగిసిన తర్వా త బదిలీలపై ముందుకెళ్తామని తెలిపారు. వీటిలో కొన్ని అంశాలపై చర్చిస్తామన్నారు.
రాష్ట్రంలో ప్రస్తుతం ‘సర్’ (సర్వీస్ రెగ్యులరైజేషన్) ప్రక్రియ కొనసాగుతోంది. ఆ తర్వాత జనగణన ఉంటుంది. మొత్తం ప్రక్రియ ముగియాలంటే 2027 ఫిబ్రవరి వరకు ఆగాల్సిందే.












