మనోరంజని తెలుగు టైమ్స్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 28
నందిపేట్ మండలంలోని వన్నెల్ k లో గల గ్రేస్ ఫెల్లో పాఠశాలలో కంటైనర్లలో విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారని, అగ్గిపెట్టెల్లా ఉన్న గదుల్లో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని పీఆర్టీయూ తెలంగాణ జిల్లా గౌరవ అధ్యక్షులు కృపాల్ సింగ్ సోడి ఆరోపించారు. పాఠశాల అనుమతి రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
నందిపేట్ మండలంలోని వన్నెల్ k లో గల గ్రేస్ ఫెల్లో పాఠశాలలో కంటైనర్లలో విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారని, అగ్గిపెట్టెల్లా ఉన్న గదుల్లో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని పీఆర్టీయూ తెలంగాణ జిల్లా గౌరవ అధ్యక్షులు కృపాల్ సింగ్ సోడి ఆరోపించారు.
సరైన గదులు, క్రీడా స్థలాలు, శిక్షణ పొందిన ఉపాధ్యాయులు లేకున్నప్పటికీ, సంబంధిత నందిపేట్ ఎంఈఓ గ్రేస్ ఫెల్లో పాఠశాలకు అనుమతి కోసం జిల్లా విద్యాశాఖకు ఎలా సిఫారసు చేశారని ఆయన ప్రశ్నించారు. పాఠశాలను సందర్శించకుండానే చెక్‌లిస్ట్, విజిట్ రిపోర్ట్‌లపై అంధుల వలె సంతకాలు చేసి జిల్లా విద్యాశాఖకు పంపినట్లు తెలిపారు.
జిల్లా విద్యాశాఖలోని సంబంధిత క్లర్కు నోట్ ఫైల్ పెడుతున్నప్పుడు సరిగా ఉన్నాయో లేదో చూడకుండా పెట్టడం, అలాగే జిల్లా విద్యాశాఖ అధికారి అనుమతులు ఇవ్వడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. ఈ పాఠశాలలో సౌకర్యాలు లేకున్నా, అన్ట్రైన్ టీచర్లతో బోధిస్తూ కార్పొరేట్ పేరుతో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని, అయినప్పటికీ నందిపేట్ ఎంఈఓ చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
కావున, జిల్లా విద్యాశాఖ అధికారి తక్షణమే సంబంధిత ఎంఈఓపై చర్యలు తీసుకొని సస్పెండ్ చేయాలని, నందిపేట్ లోని కే వన్నెల్ లో గల గ్రేస్ ఫెల్లో స్కూల్ అనుమతిని రద్దు చేయాలని కృపాల్ సింగ్ సోడి డిమాండ్ చేశారు.












