సారాంశం
నిజామాబాద్ నగరంలోని రేడియో స్టేషన్ సమీపంలో గల ఆనంద నిలయాన్ని అడిషనల్ కలెక్టర్ భుజంగరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల వసతి, సౌకర్యాలు, చదువుకు సంబంధించిన అంశాలను ఆయన పరిశీలించారు.
ముఖ్య విషయాలు
- 1విద్యార్థులకు అవసరమైన అత్యవసర మందులు 24 గంటలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
- 2నిజామాబాద్ నగరంలోని రేడియో స్టేషన్ సమీపంలో గల ఆనంద నిలయాన్ని అడిషనల్ కలెక్టర్ భుజంగరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు.
- 3ఈ సందర్భంగా విద్యార్థుల వసతి, సౌకర్యాలు, చదువుకు సంబంధించిన అంశాలను ఆయన పరిశీలించారు.
- 4విద్యార్థుల బాగోగులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ విధి నిర్వహణలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించవద్దని వార్డెన్ రాములుకు అడిషనల్ కలెక్టర్ ప్రత్యేక సూచనలు చేశారు.
నిజామాబాద్ నగరంలోని రేడియో స్టేషన్ సమీపంలో గల ఆనంద నిలయాన్ని అడిషనల్ కలెక్టర్ భుజంగరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల వసతి, సౌకర్యాలు, చదువుకు సంబంధించిన అంశాలను ఆయన పరిశీలించారు.
విద్యార్థుల బాగోగులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ విధి నిర్వహణలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించవద్దని వార్డెన్ రాములుకు అడిషనల్ కలెక్టర్ ప్రత్యేక సూచనలు చేశారు. విద్యార్థులకు అవసరమైన అత్యవసర మందులు 24 గంటలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అలాగే విద్యార్థుల చదువుపై ప్రత్యేక దృష్టి సారించి, వారి అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవాలని వార్డెన్‌కు సూచించారు. ఈ తనిఖీ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ భుజంగరావుతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.