బైంసా (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 18
మాతృభాష ప్రాధాన్యత, దాని విలువలు, సమాజ నిర్మాణంలో పోషిస్తున్న పాత్రపై విశిష్ట పరిశోధన చేసి డాక్టరేట్ పట్టా పొందిన గోపాల్రావ్ పటేల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డా. రవికుమార్‌ను కళాశాల అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ డా. రఘునాథ్ మాట్లాడుతూ, డా. రవికుమార్ సాధించిన డాక్టరేట్ కళాశాలకు గర్వకారణమని అన్నారు. మాతృభాషపై ఆయన చేసిన పరిశోధన విద్యా, సాంస్కృతిక రంగాలకు విలువైన మార్గదర్శకంగా నిలుస్తుందని పేర్కొన్నారు.
మాతృభాష ప్రాధాన్యత, దాని విలువలు, సమాజ నిర్మాణంలో పోషిస్తున్న పాత్రపై విశిష్ట పరిశోధన చేసి డాక్టరేట్ పట్టా పొందిన గోపాల్రావ్ పటేల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డా. రవికుమార్‌ను కళాశాల అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ డా. రఘునాథ్ మాట్లాడుతూ, డా. రవికుమార్ సాధించిన డాక్టరేట్ ఆయన వ్యక్తిగత విజయమే కాకుండా కళాశాలకు గర్వకారణమని అన్నారు. మాతృభాషపై ఆయన చేసిన పరిశోధన విద్యా, సాంస్కృతిక రంగాలకు విలువైన మార్గదర్శకంగా నిలుస్తుందని పేర్కొన్నారు.
కళాశాల అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు డా. నాగేశ్ మాట్లాడుతూ, మాతృభాష మన సంస్కృతి, సంప్రదాయాలు, వ్యక్తిత్వానికి మూలాధారమని అన్నారు. నేటి యువతలో, ముఖ్యంగా ఆంగ్ల మాధ్యమంలో చదివే విద్యార్థుల్లో కూడా మాతృభాష పట్ల గౌరవం, అభిమానం పెంపొందించేందుకు డా. రవికుమార్ చేస్తున్న కృషి ప్రశంసనీయమని కొనియాడారు. ఆయన సాధించిన విజయం అధ్యాపకులు, విద్యార్థులకు స్ఫూర్తిగా నిలుస్తుందని తెలిపారు.
అనంతరం డా. రవికుమార్‌ను శాలువా, పుష్పగుచ్ఛంతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రధాన కార్యదర్శి మనోజ్, అసోసియేట్ ప్రొఫెసర్లు డా. భీంరావు, డా. ఓం ప్రకాశ్, డా. శంకర్, అధ్యాపకులు రాజు, సంతోష్, కిషన్, రాజయ్య, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొని డా. రవికుమార్‌కు అభినందనలు తెలిపారు.












