కుబీర్, జూలై 18
కుబీర్ మండలంలోని పల్సి గ్రామంలోని విద్యా భారతి పాఠశాలలో శనివారం ఆషాడ మాసం గోరింటాకు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థినిలకు గోరింటాకు పెట్టి సందడి చేశారు. ఆషాడ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం వల్ల అంటువ్యాధులు దరిచేరవని ఉపాధ్యాయులు సూచించారు.
కుబీర్ మండలంలోని పల్సి గ్రామంలోని విద్యా భారతి పాఠశాలలో శనివారం ఆషాడ మాసం గోరింటాకు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థినిలకు గోరింటాకు పెట్టి సందడి చేశారు.
మన వాతావరణం ప్రకారం ఆషాడంలో వర్షాలు పడడంతో వాతావరణం చల్లగా మారుతుందని, సూక్ష్మ క్రిములు చేతులకు అంటుకొని అంటు రోగాలు వ్యాపించే క్రమంలో గోరింటాకు పెట్టుకుంటే అంటు రోగాలు దరి చేరవని ఉపాధ్యాయులు విద్యార్థులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పురం శెట్టి లింగయ్య, ఉపాధ్యాయులు పోతన్న, మధుసూదన్, ప్రవీణ్ కుమార్, రాజు, దేవకి, శ్రీవిద్య, కవిత, రాణి, సరోజన, గంగామణి, సరస్వతి, శృతిక, నేహ, పద్మ, గంగ వేణి, లక్ష్మి, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.












