తానూర్, జూలై 18
తానూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో నాబార్డు నిధులతో నిర్మించిన అదనపు తరగతి గదులు, మౌలిక సదుపాయాలను ముధోల్ శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రూ.56 లక్షల వ్యయంతో నిర్మించిన అదనపు తరగతి గదులతో పాటు రూ.42.12 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాలను ప్రజలకు అంకితం చేశారు.
తానూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో నాబార్డు నిధులతో నిర్మించిన అదనపు తరగతి గదులు, మౌలిక సదుపాయాలను ముధోల్ శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రూ.56 లక్షల వ్యయంతో నిర్మించిన అదనపు తరగతి గదులతో పాటు రూ.42.12 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాలను ప్రజలకు అంకితం చేశారు. అనంతరం విద్యార్థినులకు పాఠశాల దుస్తులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థినులకు నాణ్యమైన విద్య అందించేందుకు అవసరమైన సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. మెరుగైన విద్యా వాతావరణం ఏర్పడేందుకు ఈ అభివృద్ధి పనులు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బైంసా వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు షిందే ఆనందరావు పాటిల్, తానూర్ మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు పుండ్రు లక్ష్మణ్ రెడ్డి, పాఠశాల అధికారులు, ప్రజాప్రతినిధులు, మండల నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు.












