‘‘ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 27
బైంసా మండలంలోని చుచుంద్ ప్రాథమిక పాఠశాలలో భారత మాజీ రాష్ట్రపతి, ప్రముఖ శాస్త్రవేత్త, ‘మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ డా. ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, దేశాభివృద్ధికి ఆయన చేసిన సేవలను, యువతకు అందించిన స్ఫూర్తిదాయక సందేశాలను స్మరించుకున్నారు.
బైంసా మండలంలోని చుచుంద్ ప్రాథమిక పాఠశాలలో భారత మాజీ రాష్ట్రపతి, ప్రముఖ శాస్త్రవేత్త, ‘మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ డా. ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతిని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా డా. అబ్దుల్ కలాం చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, దేశాభివృద్ధికి ఆయన చేసిన విశిష్ట సేవలను, యువతకు అందించిన స్ఫూర్తిదాయక సందేశాలను స్మరించుకున్నారు. అనంతరం విద్యార్థులకు కలాం జీవితం, కృషి, ఆశయాల గురించి వివరించారు.
విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని ప్రధానోపాధ్యాయులు పి. సురేష్ సూచించారు. ‘‘కలలు కనండి... ఆ కలలను నిజం చేసుకునే వరకు శ్రమించండి’’ అనే డా. కలాం సందేశాన్ని ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు జి. రాజేశ్వర్, జ్యోత్స్న, పద్మతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.












