ఖానాపూర్, 2023-09-05
పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయుడు జడ భీమలింగం సేవలు చిరస్మరణీయమని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం () ప్రధాన కార్యదర్శి జుట్టు గజేందర్ అన్నారు. మంగళవారం కొండకూర్ లో ఆయన పదవీ విరమణ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయుడు జడ భీమలింగం సేవలు చిరస్మరణీయమని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం () ప్రధాన కార్యదర్శి జుట్టు గజేందర్ అన్నారు. మంగళవారం కొండకూర్ లో భీమలింగం పదవీ విరమణ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
ఉపాధ్యాయ ఉద్యోగం అన్ని ఉద్యోగాల కంటే గొప్ప పేరు తెచ్చిపెడుతుందని, నేటి విద్యార్థులను రేపటి పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత వహించడం గర్వకారణమని గజేందర్ అన్నారు. ఈ సందర్భంగా అతిథులు భీమలింగం సేవలను కొనియాడారు.
ఈ సందర్భంగా గజేందర్ మాట్లాడుతూ, ప్రభుత్వం కఠినత్వాన్ని వీడి ఉద్యోగులపై కరుణ చూపాలని, తమకు రావాల్సిన ఆరు డీఏలు, పీఆర్సీ అమలు చేయాలని కోరారు. రానున్న కాలంలో ఉపాధ్యాయులకు గడ్డు పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉందని, పర్యవేక్షణ పేరుతో ఉద్యోగులను వేధిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యను అందించే సమయం లేకుండా వివిధ యాప్ల నిర్వహణలోనే సమయం గడిచిపోతుందని అన్నారు. విద్యార్థులకు విద్యను అందించడంలో ఉపాధ్యాయుల కృషి వల్లే ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వంటి ఉన్నత స్థాయి అధికారులు, మంచి రాజకీయ నాయకులు తయారవుతున్నారని గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ ఉపాధ్యాయులు పొద్దుటూరు మమత అధ్యక్షత వహించగా, ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్ శ్యామ కృష్ణ ప్రసాద్, ఉపాధ్యాయులు కే మౌనిక, వి మౌనిక, ఎస్టీయూ నాయకులు అధ్యక్షులు శీర్ల భూమన్న యాదవ్, జై లక్ష్మణ్, బి.వి. రావు, ఎం. శ్రీనివాస్, దూస లక్ష్మీనారాయణ, మఠం పరమేశ్వర్, కోట వేణు, అశోక్ రెడ్డి, ఖానాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు గంగన్న, సత్తనపల్లి సర్పంచ్ శీర్ల విజయ్, ఉపాధ్యాయులు, బంధుమిత్రులు పాల్గొన్నారు.












