మండలంలోని ముక్కాల (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 23
మండలంలోని ముక్కాల గ్రామ సి.ఎస్.ఐ. చర్చి సంఘ సభ్యులు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వద్ద పస్కా పండుగను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వనభోజన కార్యక్రమంలో స్థానిక చర్చి పాస్టర్లు, బాధ్యతల నిర్వాహకులు రేవరెండ్ ఎస్. కమలాకర్ బైబిల్ గ్రంథం నుంచి పస్కా పండుగ విశిష్టతను వివరించారు.
మండలంలోని ముక్కాల గ్రామ సి.ఎస్.ఐ. చర్చి సంఘ సభ్యులు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వద్ద పస్కా పండుగను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వనభోజన కార్యక్రమంలో స్థానిక చర్చి పాస్టర్లు, బాధ్యతల నిర్వాహకులు రేవరెండ్ ఎస్. కమలాకర్ బైబిల్ గ్రంథం నుంచి పస్కా పండుగ విశిష్టతను వివరించారు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు బానిసత్వం నుంచి విముక్తి పొందిన సందర్భాన్ని స్మరించుకుంటూ పస్కా పండుగను నిర్వహిస్తారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో క్రైస్తవులు, యువత, చిన్నారులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఆధ్యాత్మిక సందేశాలను ఆలకించారు. అనంతరం శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ యువత తమ దూరవాణి పరికరాల్లో అందమైన దృశ్యాలను చిత్రీకరించారు.
పస్కా పండుగ సందర్భంగా కుటుంబ సభ్యులు, బంధువులు, శ్రేయోభిలాషులను ప్రత్యేకంగా ఆహ్వానించి వనభోజనంలో పాల్గొనేలా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక పాస్టర్ జయప్రసాద్, డాక్టర్ దేవేందర్, కమటం ఆనంద్ కుమార్, సూర్యరావు, సంఘ కమిటీ సభ్యులు, యువజన సభ్యులు, చిన్నారులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.












