మాక్లూర్, జులై 22
మాక్లూర్ మండలంలోని మాదాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మితమవుతున్న ఎల్లమ్మ ఆలయ నిర్మాణ పనులను ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ప్రొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి బుధవారం పరిశీలించారు. ఆలయ నిర్మాణం సకాలంలో పూర్తి కావాలని ఆయన ఆకాంక్షించారు.
మాక్లూర్ మండలంలోని మాదాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మితమవుతున్న ఎల్లమ్మ ఆలయాన్ని ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ప్రొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి బుధవారం సందర్శించారు.
ఈ సందర్భంగా ఆలయ నిర్మాణ పనులను పరిశీలించి, నిర్వాహకులతో మాట్లాడారు. ఆలయ నిర్మాణం సకాలంలో పూర్తై భక్తులకు అందుబాటులోకి రావాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మాక్లూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు దయాకర్ రావు, జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి, మాక్లూర్ సర్పంచ్ వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గంగాధర్ గౌడ్, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు వినోద్, సర్పంచులు, ఉప సర్పంచులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.












