నిర్మల్, జులై 22
కడెం మండలం అంబర్పేట గ్రామంలో నల్ల పోచమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. పెద్దమనుషులు, ఆడపడుచులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు.
కడెం మండలం అంబర్పేట గ్రామంలో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో నల్ల పోచమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం పెద్దమనుషులు, ఆడపడుచుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. దావతులతో పాటు డప్పు చప్పుళ్ల మధ్య, మహిళలు బోనాలు సమర్పిస్తూ అమ్మవారిని ఊరేగింపుగా ఆలయంలో ప్రతిష్ఠించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తాళ్లపల్లి రమేష్, ఉపసర్పంచ్ విజయ్, మాజీ సర్పంచ్, మాజీ ఉపసర్పంచ్లు, రేంకల రాజన్న, అయ్యోరీ బుచ్చన్న, వెంకట్, రమేష్, సంపత్, శ్రీను, వేణుతో పాటు గ్రామ పెద్దలు, మహిళలు, ఆడపడుచులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. కార్యక్రమం భక్తిశ్రద్ధలతో, ఉత్సాహభరిత వాతావరణంలో విజయవంతంగా ముగిసింది.












