బాసర, జూలై 21
బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దేవస్థానంలో మంగళవారం భక్తులు సమర్పించిన ఒడి బియ్యం హుండీలను ఆలయ అధికారులు విప్పారు. ఈ సందర్భంగా లభించిన కానుకలతో పాటు 48 క్వింటాళ్ల ఒడి బియ్యం ద్వారా ఆలయానికి రూ.1,00,379 ఆదాయం సమకూరింది.
బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దేవస్థానంలో మంగళవారం భక్తులు సమర్పించిన ఒడి బియ్యం హుండీలను ఆలయ అధికారులు విప్పారు. ఈ సందర్భంగా ఎండు కొబ్బరి కుడుకలు, బాదం, బరడి పోకలు, పసుపు కొమ్మలు, ఖర్జూర పండ్లు తదితర కానుకలు లభించాయి.
హుండీల ద్వారా వచ్చిన కానుకల విలువ రూ.7,308 కాగా, 50 కిలోల చొప్పున 97 సంచుల్లో మొత్తం 48 క్వింటాళ్ల ఒడి బియ్యం లభించింది. ఈ బియ్యం విలువ రూ.93,071గా అంచనా వేయగా, మొత్తం కలిపి ఆలయానికి రూ.1,00,379 ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు.
ఆలయ ఈఓ అనుమతితో నిర్వహించిన హుండీల విప్పక కార్యక్రమాన్ని ఏఈఓ గంగా శ్రీనివాస్ పర్యవేక్షించారు. కార్యక్రమంలో ఆలయ పర్యవేక్షకులు సంజీవ్‌రావు, శివరాజ్, ఆలయ సిబ్బంది, వాగ్దేవి లేబర్ సొసైటీ సభ్యులు, హోంగార్డులు పాల్గొన్నారు.











