నిర్మల్ జిల్లా, సారంగాపూర్ మండలంలోని ప్రసిద్ధ ఆడెల్లి శ్రీ మహా పోచమ్మ ఆలయం ఆదివారం భక్తుల రద్దీతో కిటకిటలాడింది. వివిధ జిల్లాలతో పాటు మహారాష్ట్ర నుంచి భక్తులు తరలివచ్చారు.
ఉదయం నుంచే భక్తులు ఆలయ కోనేటిలో పుణ్యస్నానాలు ఆచరించి, అమ్మవారి దర్శనం కోసం క్యూలలో నిలబడ్డారు. భక్తులు తమ మొక్కులను చెల్లించుకోవడానికి పుట్టెంటులు, ఓడిబియ్యం సమర్పించారు. ఖుషీ పండుగలు జరుపుకున్నారు.
అదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలతో పాటు మహారాష్ట్రలోని నాందేడ్, నాక్ పూర్, పర్బాని జిల్లాల నుంచి భక్తులు ప్రత్యేక వాహనాల్లో ఆలయానికి చేరుకున్నారు.
ఆలయ ఈఓ భూమయ్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆలయ పరిసరాల్లో భక్తులు వంటా వార్పు చేసుకుని భోజనాలు చేశారు.
ఆలయం మరియు పరిసర ప్రాంతాలలో శాంతిభద్రతలను కాపాడేందుకు స్థానిక ఎస్సై శ్రీకాంత్ నేతృత్వంలో పోలీసులు పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు.











