సాయి దీక్ష సేవా సమితి ఆధ్వర్యంలో నిర్మల్ పట్టణంలో సాయి సంకీర్తన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో సాయి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
నిర్మల్ పట్టణంలోని నటరాజ్ నగర్ లో గల సాయి భక్తుడు కందుల పంటరి నివాసంలో శనివారం సాయి సంకీర్తన కార్యక్రమం జరిగింది. సాయిబాబా ఆలయం నుంచి సాయి పాదుకలు, చిత్రపటాన్ని ఊరేగింపుగా తీసుకువచ్చి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
సమితి అధ్యక్షులు లక్కడి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, ప్రతి శనివారం భక్తుల ఇళ్లల్లో సాయి సంకీర్తన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. గతంలో గండి రామన్న సాయిబాబా ఆలయంలో పూజల అనంతరం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమం ద్వారా భక్తులు సాయినాధుని ఆశీర్వచనాలను పొందవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సమితి సభ్యులు పండరి, నందు, రాజు, శ్రీనివాస్ వర్మ, మహేందర్ యాదవ్, జిందం గోవర్ధన్, కోల శంకర్, రాజేష్, ప్రకాశ్ గౌడ్, రేఖ, మాధవి తదితరులు పాల్గొన్నారు.












