తానూర్ మండలంలోని వడ్గాం గ్రామంలో కొనసాగుతున్న అఖండ హరినామ సప్తాహం ఏడవ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా శుక్రవారం సాయంత్రం గ్రామంలో పల్లకీ ఊరేగింపు శోభాయాత్ర అత్యంత వైభవంగా నిర్వహించారు.
ఆలయ కమిటీ నిర్వాహకుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజల అనంతరం ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. గ్రామంలోని ప్రధాన వీధుల గుండా సాగిన ఈ శోభాయాత్రలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని మంగళహారతులతో ఊరేగింపునకు ఆధ్యాత్మిక శోభను తెచ్చారు.
భజన మండలి సభ్యులు నిర్వహించిన భజనలు, కీర్తనలు ఈ ఊరేగింపునకు మరింత ఉత్సాహాన్నిచ్చాయి. గ్రామంలోని వాతావరణం మొత్తం ఆధ్యాత్మిక పరిమళంతో నిండిపోయింది.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కదం సుమన్ బాయి - గోవింద్ రావు పటేల్, మాజీ సర్పంచులు సంతోష్ పటేల్, చక్రధర్ పటేల్, గ్రామ పెద్దలు బల్వంత్ పటేల్, హన్మంత్ పటేల్, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు.












