నిర్మల్, 2026-08-08
ి్మల్జిల్లే్లిప్సి్ధశ్హిహ్షేత్లయలశివత్ిగు్తుతెలియిుడగులుచొబడిచిపల్పడ్డు.లయతలుపులుపగులగొట్టిలపలిిప్వేశిచిొగలు,లయలిశేషవస్త్లు,విలువైణలుఅల్లోల ఇంద్రకరణ్ రెడ్డి....పహిచుె్లు.ఈఘటపైష్ట్మజమత్ిఅల్లోలల్లల రెడ్డి....్ణ్ెడ్డితవ్వ్య్తచేశు.
నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రసిద్ధ శ్రీ హరిహర క్షేత్రం ఆలయంలో శనివారం రాత్రి గుర్తుతెలియని దుండగులు చొరబడి భారీ చోరీకి పాల్పడ్డారు. ఆలయ తలుపులు పగులగొట్టి లోపలికి ప్రవేశించిన దొంగలు, ఆలయంలోని శేష వస్త్రాలు, విలువైన ఆభరణాలను అపహరించుకెళ్లారు. ఆలయ నిర్వాహకుల సమాచారం మేరకు సుమారు 10 కిలోల వెండి, 2 తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు ప్రాథమికంగా అంచనా వేశారు.
ఆలయాన్ని పరిశీలించిన మాజీ మంత్రి
ఈ ఘటనపై సమాచారం అందుకున్న రాష్ట్ర మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఆదివారం ఆలయాన్ని సందర్శించారు. చోరీ జరిగిన తీరును, దుండగులు ధ్వంసం చేసిన ఆలయ తలుపులు, ఇతర ప్రాంతాలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. ఆలయ పూజారులు, నిర్వాహకులను అడిగి ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకున్నారు.
నిందితుల అరెస్ట్ కు డిమాండ్
ఈ సందర్భంగా మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ, ఆధ్యాత్మిక కేంద్రమైన శ్రీ హరిహర క్షేత్రంలో దొంగతనం జరగడం అత్యంత విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి సమగ్ర విచారణ చేపట్టాలని ఆయన కోరారు. ఆలయ పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి, నిందితులను త్వరగా గుర్తించి అరెస్ట్ చేయాలని పోలీసు అధికారులను డిమాండ్ చేశారు.
ఆభరణాల రికవరీ చేయాలి
అలాగే, భక్తుల మనోభావాలకు భంగం కలగకుండా చోరీకి గురైన బంగారం, వెండి ఆభరణాలను త్వరితగతిన రికవరీ చేయాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ ఘటనపై స్థానిక ప్రజలు, భక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఘటనలో పాల్గొన్నవారు
ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త అల్లోల మురళీధర్ రెడ్డి, అల్లోల సురేందర్ రెడ్డి, డీసీసీబీ వైస్ చైర్మన్ రఘునందన్ రెడ్డి, పీవీ రమణ రెడ్డి ( చైర్మన్), కృష్ణ ప్రసాద్ రెడ్డి ( చైర్మన్), ఆమెడా శ్రీధర్ (మాజీ చైర్మన్), మలేష్ (నిర్మల్ మండలం కన్వీనర్), శ్రీనివాస్ రెడ్డి (సర్పంచ్), వినోద్ (మాజీ సర్పంచ్), బి. లింగన్న (మాజీ సర్పంచ్), పోశెట్టి (మాజీ సర్పంచ్), గంగాధర్ (మాజీ సర్పంచ్), గంగారెడ్డి (మాజీ ఆత్మ చైర్మన్), సారంగాపూర్ మండల్ మాజీ ఎంపీపీ మహిపాల్ రెడ్డి, పతని భూమేష్ తదితరులు పాల్గొన్నారు.












