కుబీర్, జూలై 13
నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని పంగ్రా గ్రామంలో సుమారు రూ.10 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న వివో మహిళా సంఘ భవన నిర్మాణ పనులను ముధోల్ మాజీ ఎమ్మెల్యే జి. విఠల్ రెడ్డి ఆదివారం పరిశీలించారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆయన సూచించారు.
నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని పంగ్రా గ్రామంలో సుమారు రూ.10 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న వివో మహిళా సంఘ భవన నిర్మాణ పనులను ముధోల్ మాజీ ఎమ్మెల్యే జి. విఠల్ రెడ్డి ఆదివారం పరిశీలించారు.
ఈ సందర్భంగా నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించిన ఆయన, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులను త్వరగా పూర్తి చేయాలని సంబంధిత వారికి సూచించారు. మహిళా సంఘాలకు ఉపయోగపడేలా భవన నిర్మాణం చేపట్టడం అభినందనీయమని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ దిగంబర్ పటేల్, మాజీ సర్పంచ్ మైపాల్ రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ అరుణ్, సాహెబ్రావు తదితరులు పాల్గొన్నారు.












