కుబీర్, 12 July
కుబీర్ మండలంలోని పంగ్రా గ్రామంలో సుమారు పది లక్షల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న వివో మహిళా సంఘ భవన నిర్మాణ పనులను ముధోల్ మాజీ శాసనసభ్యులు శ్రీ జి.విఠల్ రెడ్డి గారు బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన నిర్మాణ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా పనులు చేపట్టాలని సూచించారు.

ఈ పరిశీలన కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు విఠల్ రెడ్డితో పాటు మాజీ సర్పంచ్ దిగంబర పటేల్, మాజీ సర్పంచ్ మైపాల్ రెడ్డి, ఏం సి డైరెక్టర్ అరుణ్, సాహెబ్ రావు తదితరులు పాల్గొన్నారు. భవన నిర్మాణంలో జరుగుతున్న పనులను వారు దగ్గరి నుండి పరిశీలించి, పలు సూచనలు చేశారు. మహిళా సంఘానికి ఈ భవనం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, వారి కార్యకలాపాలకు మరింత ఊతం ఇస్తుందని ఈ సందర్భంగా పలువురు అభిప్రాయపడ్డారు.