భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఘనంగా వేడుకలు జరిగాయి. కొంపల్లి చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
మాజీ రాష్ట్ర జడ్పీటీసీల ఫోరం ప్రధాన కార్యదర్శి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ, అంబేద్కర్ కేవలం ఒక వర్గానికి పరిమితం కాని మహనీయుడని, ఆయన అందరివాడని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన మేధావిగా ఆయన దేశానికి దిక్సూచిగా నిలిచారని కొనియాడారు.
కొన్ని శక్తులు అంబేద్కర్ పేరు, వారసత్వాన్ని చెరిపివేయాలని ప్రయత్నించినా, ఆయన చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని మనోహర్ రెడ్డి స్పష్టం చేశారు.
సమాజంలో సమానత్వం, న్యాయం సాధనలో అంబేద్కర్ చూపిన మార్గం ఎల్లప్పుడూ మార్గదర్శకంగా ఉంటుందని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ సడి మేల యాదగిరి ప్రసాద్, మాజీ సర్పంచ్ దేవేందర్ అధ్వైరామ్ తో పాటు పలువురు పాల్గొన్నారు.








