లింబ గ్రామంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 133వ జయంతిని పురస్కరించుకుని ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు చేసి, నివాళులర్పించారు. అనంతరం గ్రామంలో భారీ ర్యాలీ చేపట్టారు.
గ్రామంలో జరిగిన ఈ వేడుకలలో పలువురు గ్రామస్తులు, మహిళలు, యువత పాల్గొన్నారు. అంబేద్కర్ చిత్రపటాలు, జెండాలు చేతబూని ఆయన ఆశయాలకు జైకొట్టారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. అంబేద్కర్ జీవితం, ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు.
వక్తలు మాట్లాడుతూ, అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాతగా, దళితుల అభ్యున్నతికి పాటుపడిన మహానాయకుడని కొనియాడారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.








