భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకుని, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (బిఎల్ఆర్) ఆధ్వర్యంలో ప్రతిరోజూ 3,000 మందికి ఉచిత పెరుగన్నం పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. వేసవి కాలంలో ప్రజలకు ఉపశమనం కలిగించే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టారు.
మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో, అంబేద్కర్ విగ్రహ ప్రాంగణంలో వేడుకలు నిర్వహించి, అనంతరం 'న్యాయ బోజ్ - సహా పంక్తి భోజనాలు' ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బిఎల్ఆర్ మాట్లాడుతూ, అంబేద్కర్ ఆశయాల సాధనకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఎమ్మెల్యే బిఎల్ఆర్ మాట్లాడుతూ, వేసవి కాలం అంతా ఈ పెరుగన్నం పంపిణీ కొనసాగుతుందని, ప్రతిరోజు సుమారు 3,000 మందికి అందిస్తామని, అవసరమైతే ఈ సంఖ్యను 5,000 వరకు పెంచే అవకాశం ఉందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ వేముల వీరేశం, నల్గొండ డిసిసి అధ్యక్షుడు పున్న కైలాష్ నేత, మున్సిపల్ చైర్ పర్సన్ చిలుకూరి సుధా బాలకృష్ణ, వైస్ చైర్ పర్సన్ గుడిపాటి శిరీష నవీన్, డి.ఎస్.పి రాజశేఖర్ రాజు, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ కుల, రాజకీయ పార్టీల నాయకులు, అంబేద్కర్ అభిమానులు, బిఎల్ఆర్ బ్రదర్స్ పాల్గొన్నారు.












