Krishna/Avanigadda Rural (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 23
నిజామాబాద్ ఆఫీసర్స్ క్లబ్ కోశాధికారి జీ. సురేష్ గౌడ్ మాతృమూర్తి, నందిపేట నేతాజీ రిక్రియేషన్ క్లబ్ మాజీ కార్యదర్శి కె. శే. జీ.భూమాగౌడ్ సతీమణి అయిన జీ. అరుణ మృతి చెందారు. ఆమె స్వగ్రామం కుద్వాన్పూర్లో జరిగిన అంతిమయాత్రలో మాజీ జడ్పీ చైర్మన్ విఠల్ రావు పాల్గొని నివాళులర్పించారు.
నందిపేటలో గతంలో నేతాజీ రిక్రియేషన్ క్లబ్ అధ్యక్షుడిగా ఉన్న దాదాన్నగారి విఠల్ రావు, క్లబ్ కార్యదర్శిగా పనిచేసిన కె. శే. జీ.భూమాగౌడ్ సతీమణి, నిజామాబాద్ ఆఫీసర్స్ క్లబ్ కోశాధికారి జీ. సురేష్ గౌడ్ మాతృమూర్తి అయిన జీ. అరుణ నిజామాబాద్లో మృతి చెందారు.
ఆమె స్వగ్రామమైన కుద్వాన్పూర్లో నిర్వహించిన అంతిమయాత్రలో నిజామాబాద్ జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ దాదాన్నగారి విఠల్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీ. అరుణ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. మృతురాలి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, ఈ విషాదాన్ని తట్టుకునే ధైర్యాన్ని కుటుంబ సభ్యులకు ప్రసాదించాలని ఆకాంక్షించారు.












