నిర్మల్, జులై 22
జిల్లాలో భారత రెడ్‌క్రాస్ సంస్థ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జిల్లా ఉపాధి కల్పన అధికారి విజయలక్ష్మి బుధవారం జిల్లా విశ్రాంత ఉద్యోగుల సంఘ కార్యాలయంలో లాంఛనంగా ప్రారంభించారు. సామాజిక సేవా దృక్పథం కలిగిన వ్యక్తులు, స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు ముందుకు వచ్చి విరాళాలు అందజేసి సభ్యత్వం నమోదు చేసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు.
జిల్లాలో భారత రెడ్‌క్రాస్ సంస్థ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జిల్లా ఉపాధి కల్పన అధికారి విజయలక్ష్మి బుధవారం జిల్లా విశ్రాంత ఉద్యోగుల సంఘ కార్యాలయంలో లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రెడ్‌క్రాస్ ఒక అంతర్జాతీయ స్వచ్ఛంద సేవా సంస్థగా ఎన్నో ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలతో సమన్వయంగా పనిచేస్తూ ప్రజలకు సేవలందిస్తోందన్నారు. సామాజిక సేవా దృక్పథం కలిగిన వ్యక్తులు, స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు ముందుకు వచ్చి విరాళాలు అందజేసి సభ్యత్వం నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. జిల్లాకు నోడల్ అధికారిగా నియమితులైన నేపథ్యంలో సభ్యత్వ నమోదు, ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఎం.సి. లింగన్న మాట్లాడుతూ తొలి రోజే 50 మందికి పైగా విశ్రాంత ఉద్యోగులు విరాళాలు అందజేసి రెడ్‌క్రాస్ సభ్యత్వం స్వీకరించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్వదేశ్ పరికిపండ్ల ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ రాష్ట్ర సభ్యులు, విశ్రాంత ఉద్యోగుల సంఘం నాయకులు జనార్దన్, గడ్దాస్ రమేష్, లక్ష్మణ్, నరేందర్, వకుళ, రజిని తదితరులు పాల్గొన్నారు.












