ఖానాపూర్, జులై 22
ఖానాపూర్ మున్సిపల్ పరిధిలోని పద్మావతి నగర్లో అమృత్ 2.0 పథకం కింద ఏర్పాటు చేసిన తాగునీటి పైప్‌లైన్‌కు బుధవారం మరమ్మతులు చేపట్టారు. కాలనీలో నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు మున్సిపల్ సిబ్బంది ఈ పనులు చేపట్టారు.
ఖానాపూర్ మున్సిపల్ పరిధిలోని పద్మావతి నగర్లో అమృత్ 2.0 పథకం కింద ఏర్పాటు చేసిన తాగునీటి పైప్‌లైన్‌కు బుధవారం మరమ్మతులు చేపట్టారు. కాలనీలో నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు మున్సిపల్ సిబ్బంది పైప్‌లైన్ మరమ్మతు పనులను చేపట్టారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఇళ్లకు నిరంతరంగా తాగునీరు సరఫరా అయ్యేలా పైప్‌లైన్‌ను పునరుద్ధరించారు.
మరమ్మతు పనులు పూర్తికావడంతో కాలనీవాసులకు తాగునీటి సరఫరా పునరుద్ధరించబడిందని, నీటి సమస్యకు పరిష్కారం లభించిందని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.












