హుస్నాబాద్, 12 July
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కేంద్రంలో జరిగిన గౌడ జన హక్కుల పోరాట సమితి మోకు దెబ్బ రాష్ట్రస్థాయి విస్తృత సమావేశంలో జాతీయ గౌడ జన హక్కుల పోరాట సమితి మోకు దెబ్బ జాతీయ అధ్యక్షులు, జే ఏ సి చైర్మన్ అమరవేణి నర్సాగౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం గౌడ కులస్తులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కేంద్రంలో జరిగిన గౌడ జన హక్కుల పోరాట సమితి మోకు దెబ్బ రాష్ట్రస్థాయి విస్తృత సమావేశంలో జాతీయ గౌడ జన హక్కుల పోరాట సమితి మోకు దెబ్బ జాతీయ అధ్యక్షులు, జే ఏ సి చైర్మన్ అమరవేణి నర్సాగౌడ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం గౌడ కులస్తులకు ఇచ్చిన హామీలన్నీ తుంగలో తొక్కిందని విమర్శించారు. ఎన్నికల సందర్భంగా వైన్ షాపుల్లో ఇరవై ఐదు శాతం గౌడ కులస్తులకు కేటాయిస్తామని చెప్పి, గద్దెనెక్కిన తర్వాత మొండిచేయి చూపించి గత ప్రభుత్వం ఇచ్చిన విధంగానే పదిహేను శాతానికి పరిమితం చేశారని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు దాదాపు తొమ్మిది వందల మంది గీతా కార్మికులు ప్రమాదంలో చనిపోతే, ఇంతవరకు ఒక్కరికి కూడా ఆర్థిక సహాయం అందించలేకపోయిందన్నారు.
ఎక్సైజ్ శాఖ నుండి కల్లుగీత వృత్తిని తప్పించాలని, హరిత హారం పథకంలో భాగంగా యాభై శాతం తాటి, ఈత చెట్లను ప్రభుత్వమే నాటి గౌడ కుల వృత్తిని రక్షించాలని విజ్ఞప్తి చేశారు.
ఎక్సైజ్ శాఖ మంత్రిగా గౌడ కులస్తులకు అవకాశం కల్పించినట్లయితే వారి సమస్యలు పరిష్కారమయ్యే అవకాశాలున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి లోగా జనగామ జిల్లాను సర్దార్ సర్వాయి పాపన్న జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. గీతా కార్మికులకు ఆధునిక పరికరాలు అందించాలన్నారు.












