భారతి ఛానెల్ యజమాని అక్క మృతికి విఠల్ రావు నివాళి
నిజామాబాద్: జులై 23 మనోరంజని తెలుగు టైమ్స్ భారతి ఛానెల్ యజమాని గాదె కృష్ణ అక్క ఆకస్మికంగా మృతి చెందడంతో నిజామాబాద్ మాజీ జడ్పీ చైర్మన్ దాదాన్నగారి విఠల్ రావు వారి నివాసానికి వెళ్లి ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే ధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు.












