
రాంపల్లి పారిశ్రామిక ప్రాంతంలో మౌలిక సదుపాయాలను వెంటనే కల్పించాలని సీఐటీయూ కీసర మండల కమిటీ ఆధ్వర్యంలో శనివారం సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పాతికేళ్లుగా అభివృద్ధికి నోచుకోని ఈ ప్రాంతంలో రహదారుల దుస్థితి, డ్రైనేజీ సమస్యలపై కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.



















