
వేసవిలో జనగణన–2026 విధులు నిర్వర్తించిన ఉపాధ్యాయులకు అదనపు సెలవులు మంజూరు చేయాలని కోరుతూ ఉపాధ్యాయ సంఘం నిర్మల్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అధికారి దర్శనం భోజన్నకు శనివారం వినతిపత్రం సమర్పించారు. ఈ సెలవుల మంజూరుకు సంబంధించిన ఉత్తర్వులను వెంటనే జారీ చేయాలని సంఘం నాయకులు విజ్ఞప్తి చేశారు.


















