
రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క, జలసిరి కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలని, ప్రతి ఇంటికి ఇంకుడు గుంత, ప్రతి పంటకు పంట కుంట, ప్రతి ఊరికి ఊట కుంట నినాదంతో భూగర్భ జలాల సంరక్షణకు చర్యలు ప్రారంభించామని తెలిపారు.



















