
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యవసరంగా డయాలసిస్ సెంటర్ను ఏర్పాటు చేయాలని తిరుపతి జిల్లా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాల గురవం బాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న రోగులు డయాలసిస్ కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని, దీనివల్ల వారికి తీవ్ర ఆర్థిక భారం, ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయన పేర్కొన్నారు.


















