పాడి రైతుల సంక్షేమం మరియు అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి కృషి చేస్తోందని ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ అన్నారు. ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల పథకం రైతు వారోత్సవాల్లో భాగంగా, దామరచర్ల పశువుల ఆసుపత్రిలో గర్భకోశ వ్యాధుల చికిత్స మరియు దూడల ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు.
పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో రైతులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులకు ఆయన సూచించారు. పాడి పరిశ్రమ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అని, ప్రభుత్వం రైతుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడుతోందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో దామరచర్ల సర్పంచ్ బంటు రేణుక శ్రీ, కొండ లక్ష్మణ్ గౌడ్, బారెడ్డి గోవింద రెడ్డి, దారగాని సురేష్, పూర్ణ చంద్ర నాయుడు, పశువైద్య అధికారులు, పాడి రైతులు కరణం సైదిరెడ్డి, షేక్ జానీ, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ రైతులు పాల్గొన్నారు.








