కామారెడ్డి, 30 July
కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిట్లం ఎస్సై బి ఆంజనేయులు సూచించారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయన పలు సూచనలు చేశారు.
కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిట్లం ఎస్సై బి ఆంజనేయులు తెలిపారు. ఆయన సూచనల మేరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవి:
1. పాడుబడ్డ లేదా పగుళ్లు ఉన్న ఇళ్లలో ఉండకూడదు. 2. అత్యవసర పరిస్థితులు తప్ప బయటికి వెళ్లకూడదు. 3. కరెంట్ స్తంభాలు, తెగిన వైర్లకు దూరంగా ఉండాలి, వాటిని ముట్టుకోకూడదు. 4. బోర్ మోటార్లు వేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. 5. వాగులు, వంతెనలు, నదులను దాటేటప్పుడు ప్రజలు, వాహనదారులు అత్యంత జాగ్రత్త వహించాలి. 6. వర్షపు నీరు ఎక్కువగా చేరిన ప్రాంతాల్లో నడవకూడదు. 7. చిన్నారులు, వృద్ధులు, గర్భిణీలు బయటకు వెళ్లకుండా చూడాలి. 8. తాగునీటిని మరిగించి మాత్రమే ఉపయోగించాలి. 9. ఏదైనా అత్యవసర పరిస్థితులు తలెత్తితే వెంటనే అధికారులకు తెలియపరచాలి. 10. ఈత కొట్టడానికి, చేపలు పట్టడానికి, సరదాగా సెల్ఫీలు తీసుకోవడానికి వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకోకూడదు.
ప్రజలు సురక్షిత ప్రదేశాల్లో ఉంటూ, తగిన జాగ్రత్తలు పాటించాలని ఎస్సై బి ఆంజనేయులు సూచించారు.












