సదాశివనగర్, 29 July
కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్థానిక ఎస్సై పుష్పరాజ్ సూచనలు జారీ చేశారు. ముఖ్యంగా శిథిలావస్థలో ఉన్న ఇళ్లల్లో ఉండేవారు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని, విద్యుత్ ప్రమాదాల పట్ల జాగ్రత్త వహించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండల కేంద్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సదాశివ నగర్ ఎస్సై పుష్పరాజ్ సూచించారు. ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు చేశారు.
పాత లేదా శిథిలావస్థలో ఉన్న ఇళ్లల్లో ఉండేవారు దూరంగా ఉండాలని, విద్యుత్ స్తంభాలు, తీగలు, ట్రాన్స్ఫార్మర్ల వద్దకు వెళ్లవద్దని సూచించారు. పొంగి పొర్లుతున్న వాగులు, చెరువులను దాటవద్దని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని తెలిపారు. చిన్నపిల్లలు, వృద్ధుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
ఎవరైనా నదుల్లో కానీ, ఇతర ప్రాంతాల్లో చిక్కుకుంటే వెంటనే పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని ఎస్సై పుష్పరాజ్ కోరారు. తల్లిదండ్రులు తమ పిల్లలను చెరువు గట్టుకు, పొంగి పొర్లుతున్న వాగుల వద్దకు వెళ్లకుండా చూసుకోవాలని సూచించారు.












