నిర్మల్, జూలై 16
నిర్మల్ బస్టాండ్ వద్ద గురువారం నిర్వహించిన ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కార్యక్రమంలో టౌన్ ఎస్ఐ అజయ్ పాల్గొన్నారు. ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, తప్పనిసరిగా యూనిఫాం ధరించాలని ఆటోచోదకులకు సూచించారు. అనంతరం జరిగిన తనిఖీల్లో నిబంధనలు పాటించని వాహనదారులపై చర్యలు తీసుకున్నారు.
ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని టౌన్ ఎస్ఐ అజయ్ ఆటోచోదకులకు సూచించారు. గురువారం నిర్మల్ బస్టాండ్ వద్ద నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన ట్రాఫిక్ నిబంధనలను వివరించి, ప్రతి ఆటో డ్రైవర్ తప్పనిసరిగా యూనిఫాం ధరించాలని తెలిపారు.
అనంతరం చేపట్టిన ప్రత్యేక తనిఖీల్లో ఆటోలతో పాటు ఇతర వాహనాల ధ్రువపత్రాలను పరిశీలించారు. సరైన పత్రాలు లేని వాహనదారులపై మోటారు వాహన చట్టం ప్రకారం జరిమానాలు విధించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని ఎస్ఐ పేర్కొన్నారు. ఈ తనిఖీల్లో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.












