హైదరాబాద్ నగరంలో, ముఖ్యంగా జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు నేడు (ఆదివారం) పలు ఆంక్షలను అమలు చేస్తున్నారు. కేబీఆర్ పార్క్ వద్ద జరుగుతున్న ఫ్లైఓవర్, అండర్‌పాస్ నిర్మాణ పనుల నేపథ్యంలో ఈ మళ్లింపులు చేపట్టారు.
కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు పోలీసులు ప్రయోగాత్మకంగా వన్‌వే విధానాన్ని అమలు చేస్తున్నారు. ఈ ఆంక్షలు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగుతాయి. ఈ ట్రయల్ రన్ ఫలితాల ఆధారంగా భవిష్యత్తులో శాశ్వత ట్రాఫిక్ మళ్లింపులపై నిర్ణయం తీసుకోనున్నారు.
పంజాగుట్ట వైపు వెళ్లే వాహనాలు, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ లేదా కేబీఆర్ పార్క్ వైపు వెళ్లేవారు ఎన్టీఆర్ భవనం వద్ద ఎడమవైపునకు మళ్లాలని సూచించారు. అక్కడి నుంచి బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి, అగ్రసేన్ ఐలాండ్, ఓమేగా ఆసుపత్రి మీదుగా రోడ్ నెం.45 లేదా కేబుల్ బ్రిడ్జ్ వైపు వెళ్లాల్సి ఉంటుంది.
యూసుఫ్‌గూడ, శ్రీనగర్ కాలనీ నుంచి మాదాపూర్ లేదా జూబ్లీ హిల్స్ రోడ్ నెం.36 వైపు వెళ్లేవారు ఇందిరానగర్ గడ్డ రోడ్డు, రోడ్ నెం.5 ద్వారా వెంకటగిరి జంక్షన్ చేరుకోవాలి. అనంతరం డైమండ్ హౌస్, రోడ్ నెం.10 మీదుగా అల్-కజార్ జంక్షన్ వద్ద కుడివైపునకు తిరిగి గమ్యస్థానాలకు చేరుకోవచ్చు.












