మైనర్ డ్రైవింగ్‌ను తీవ్రంగా పరిగణిస్తున్నామని, దీనిపై కఠిన చర్యలు తప్పవని కుంటాల ఎస్సై అజయ్ తెలిపారు. స్థానిక మండల కేంద్రంలో పోలీసులు మైనర్ డ్రైవింగ్‌పై ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహించారు.
ఈ డ్రైవ్‌లో భాగంగా, ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ, ట్రిపుల్ రైడింగ్ చేస్తున్న మైనర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారికి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు.
డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉన్న అర్హులైన వారే వాహనాలను నడపాలని, మైనర్లకు వాహనాలు అప్పగించడం చట్టరీత్యా నేరమని ఎస్సై అజయ్ గుర్తు చేశారు.
మైనర్ల నిర్లక్ష్యపు డ్రైవింగ్ వారి ప్రాణాలకే కాకుండా, రహదారిపై ప్రయాణించే ఇతరుల భద్రతకు కూడా ముప్పు కలిగిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


