కాంగ్టి, 3 July
గత ఏడాది వర్షానికి దెబ్బతిన్న గొట్టి-నర్సాపూర్ కల్వర్టు మరమ్మతు పనులు పూర్తయ్యాయి. దీంతో గొట్టిపటార్ గుండాల, నార్నూర్, ఇంద్రవెల్లి గ్రామాలకు రాకపోకలు సుగమం అయ్యాయి. అధికారులు జేసీబీ సహాయంతో 4 పైపులు, మొరం ఉపయోగించి మరమ్మతులు పూర్తి చేశారు.
గత ఏడాది వర్షానికి దెబ్బతిన్న గొట్టి-నర్సాపూర్ కల్వర్టు మరమ్మతు పనులు పూర్తయ్యాయి. దీనివల్ల గొట్టిపటార్ గుండాల, నార్నూర్, ఇంద్రవెల్లి గ్రామాలకు నిత్యం ప్రయాణించే ప్రయాణికులు, వ్యాపారస్తులకు రాకపోకల్లో ఇబ్బందులు తొలగిపోయాయి. అధికారులు ముందు జాగ్రత్త చర్యగా జేసీబీ సహాయంతో 4 పైపులు, మొరం ఉపయోగించి మరమ్మతులు పూర్తి చేశారు. దీంతో ప్రయాణానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా చేశారని తెలిపారు.
ప్రతి ఏటా స్వల్పపాటి వర్షానికే నీరు నిలిచి రాకపోకలు స్తంభించిపోయే ఈ కల్వర్టు స్థానంలో ఇప్పుడు 4 కొత్త పైపులు అమర్చారు. ఇరువైపులా మొరం పోసి రోడ్డును పటిష్టం చేయడంతో వరద నీరు ఆగకుండా సాఫీగా వెళ్లిపోయే వీలు కలిగింది.
ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ హేరకుమ్ర గంగారాం, ఉప సర్పంచ్ చాహకటి బాపురావు, పంచాయతీ కార్యదర్శి సచిన్, గ్రామ పంచాయతీ కార్మికులు పవార్ ప్రథమానంద్, రాజు, గిల్చే దత్తు పాల్గొన్నారు.












