షాద్‌నగర్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 26
స్కైరూట్ ఏరోస్పేస్ విక్రమ్-1 రాకెట్ విజయానికి కీలక పాత్ర పోషించిన యువ శాస్త్రవేత్త నిఖిల్ మద్దూరిని షాద్‌నగర్ బీజేపీ ఇన్చార్జ్ అందె బాబన్న సన్మానించారు. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో బీటెక్, జర్మనీ, స్వీడన్లో డబుల్ మాస్టర్స్ చేసిన నిఖిల్, విక్రమ్-1 మిషన్‌కు నావిగేషన్ సాఫ్ట్వేర్ రూపకల్పనలో కీలక భూమిక పోషించారు.
స్కైరూట్ ఏరోస్పేస్ విక్రమ్-1 రాకెట్ విజయానికి కీలకంగా కృషి చేసిన యువ శాస్త్రవేత్త నిఖిల్ మద్దూరిని షాద్‌నగర్ బీజేపీ ఇన్చార్జ్ అందె బాబన్న ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా అందె బాబన్న మాట్లాడుతూ.. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో బీటెక్ పూర్తి చేసి, జర్మనీ, స్వీడన్లో డబుల్ మాస్టర్స్ చేసిన నిఖిల్ మద్దూరి యువతకు ఆదర్శమన్నారు.
విక్రమ్-1 మిషన్‌కు అత్యంత కీలకమైన నావిగేషన్ సాఫ్ట్వేర్ రూపకల్పనలో ఆయన కీలక పాత్ర పోషించడం షాద్‌నగర్‌కు, తెలంగాణకు గర్వకారణమని అన్నారు.
భారత అంతరిక్ష రంగంలో నిఖిల్ మరిన్ని విజయాలు సాధించి దేశానికి మరింత పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
అనంతరం నిఖిల్ మద్దూరికి శాలువా కప్పి జ్ఞాపిక అందించి సన్మానించారు.
కార్యక్రమంలో రవి నాయక్, శ్రీనివాస్ తదితర బీజేపీ నాయకులు పాల్గొన్నారు.










