ఆదాయపు పన్ను శాఖ, పాన్ కార్డ్ జారీ ప్రక్రియలో కీలక మార్పులను ఏప్రిల్ 1, 2024 నుండి అమలు చేయనుంది. ముఖ్యంగా 18 ఏళ్లు పైబడిన వారికి కొత్త నిబంధనలు వర్తిస్తాయి.
కొత్త నిబంధనల ప్రకారం, ఏప్రిల్ 1 తర్వాత పాన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసేవారు తప్పనిసరిగా తమ జనన ధృవీకరణ పత్రం (Birth Certificate) మరియు ఇతర ధ్రువీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ఈ పత్రాల వెరిఫికేషన్ పూర్తయిన తర్వాతే పాన్ కార్డ్ జారీ ప్రక్రియ కొనసాగుతుంది.
అయితే, మార్చి 31 లోపు దరఖాస్తు చేసుకునే వారికి ఈ అదనపు నిబంధనలు వర్తించవు. ప్రస్తుతం, ఆధార్‌తో అనుసంధానమైన మొబైల్ నంబర్‌కు వచ్చే OTP ద్వారా తక్షణమే పాన్ కార్డ్ పొందవచ్చు. ఈ ప్రక్రియకు ఎటువంటి రుసుము లేదు.
ఈ మార్పులు ముఖ్యంగా విద్యార్థులు మరియు కొత్తగా 18 ఏళ్లు నిండిన వారికి వర్తిస్తాయి. వీరు త్వరగా పాన్ కార్డ్ పొందడానికి ప్రస్తుత ప్రక్రియను ఉపయోగించుకోవాలని సూచించబడింది. కొత్త నిబంధనలు అమలులోకి వస్తే, దరఖాస్తు ప్రక్రియకు ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది.
ఆదాయపు పన్ను శాఖ ఈ మార్పుల ద్వారా పాన్ కార్డ్ దరఖాస్తు ప్రక్రియలో పారదర్శకతను పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. వయస్సు నిర్ధారణకు జనన ధృవీకరణ పత్రాలను తప్పనిసరి చేయడం ఈ ప్రక్రియలో భాగంగా ఉంది.



