మనోరంజని తెలుగు టైమ్స్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 07
మరో 3-4 నెలల్లో మొబైల్ టారిఫ్లు 12% నుంచి 15% వరకు పెరిగే అవకాశం ఉందని 'సెంట్రమ్ ఇన్స్టిట్యూషనల్ రీసెర్చ్' అంచనా వేసింది. 4G/5G వినియోగం పెరగడంతో డేటా వినియోగం గణనీయంగా పెరగడమే దీనికి ప్రధాన కారణమని నివేదిక పేర్కొంది.
మొబైల్ వినియోగదారులకు షాకింగ్ వార్త. మరో 3-4 నెలల్లో మొబైల్ టారిఫ్లు పెరిగే అవకాశం ఉందని 'సెంట్రమ్ ఇన్స్టిట్యూషనల్ రీసెర్చ్' అంచనా వేసింది. సుమారు 12% నుంచి 15% వరకు చార్జీలు పెరగొచ్చని ఈ నివేదిక పేర్కొంది.
4G/5G వినియోగం గణనీయంగా పెరగడంతో డేటా వినియోగం కూడా భారీగా పెరిగిందని సంస్థ వెల్లడించింది. ఈ నేపథ్యంలో, జూన్ త్రైమాసికంలో టెలికాం కంపెనీల ARPU (Average Revenue Per User) 1% నుంచి 1.5% వరకు పెరగవచ్చని అంచనా వేసింది.












