భైంసా, జూలై 6
నిర్మల్ జిల్లా భైంసా మండలం మాంజరి గ్రామానికి చెందిన కదం శ్రీధర్, కుబీర్ మండలం రంగశివనీ గ్రామానికి చెందిన కదం అవాంతిక ఆట్యా–పాట్యా (సబ్ జూనియర్) రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వీరు భైంసాలోని వేదాంత తపోవన్ పాఠశాలలో చదువుతున్నారు.
నిర్మల్ జిల్లా భైంసా మండలం మాంజరి గ్రామానికి చెందిన కదం నాగేందర్ పటేల్ కుమారుడు కదం శ్రీధర్, అలాగే కుబీర్ మండలం రంగశివనీ గ్రామానికి చెందిన కదం మాధవరావు కుమార్తె కదం అవాంతిక ఆట్యా–పాట్యా (సబ్ జూనియర్) రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. శ్రీధర్ ప్రస్తుతం భైంసాలోని వేదాంత తపోవన్ పాఠశాలలో 7వ తరగతి, అవాంతిక 9వ తరగతి చదువుతున్నారు.
జిల్లా స్థాయి పోటీల్లో విశేష ప్రతిభ కనబర్చిన ఈ ఇద్దరు విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించడం పాఠశాలకు గర్వకారణంగా నిలిచింది. విద్యార్థుల కృషి, ఉపాధ్యాయుల శిక్షణ, తల్లిదండ్రుల ప్రోత్సాహం ఫలితంగానే ఈ విజయం సాధ్యమైందని పాఠశాల యాజమాన్యం పేర్కొంది.
ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ రెడ్డి, డైరెక్టర్ వరలక్ష్మి, అకాడమీ డైరెక్టర్ దత్తాత్రి విద్యార్థులను ఘనంగా అభినందించారు. రాష్ట్రస్థాయి పోటీల్లోనూ అత్యుత్తమ ప్రతిభ కనబర్చి పాఠశాల, జిల్లా పేరు మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థుల ఈ విజయం ఇతరులకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.












