వీర్నపల్లి (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 15
రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం వన్పల్లి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు గ్రామ సర్పంచ్ తడగొండ సాయిలు తన తల్లి కీ.శే. తడగొండ రాజవ్వ జ్ఞాపకార్థం శుద్ధజల కేంద్రాన్ని వితరణ చేశారు. సుమారు రూ.20 వేల విలువైన ఈ శుద్ధజల కేంద్రాన్ని పాఠశాల విద్యార్థుల సౌకర్యార్థం అందజేశారు.

సర్పంచ్ సాయిలు విజ్ఞప్తి
ఈ సందర్భంగా సర్పంచ్ తడగొండ సాయిలు మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు స్వచ్ఛమైన, శుద్ధమైన నీటిని తాగాలనే ఉద్దేశంతో తన తల్లి జ్ఞాపకార్థం ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి దాతలు ముందుకు వచ్చి తమవంతు సహకారం అందించాలని కోరారు.
పాల్గొన్నవారు
ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ జింక పద్మ, ప్రధానోపాధ్యాయులు అనిల్, అంగన్వాడీ ఉపాధ్యాయురాలు గొర్రె లావణ్య, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.