సారంగాపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణపై అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు ఓటరు నమోదు ప్రక్రియ మరియు ఓటు హక్కు ప్రాముఖ్యత గురించి వివరించారు.
అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలని, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనదని శిక్షణ పొందుతున్న డిప్యూటీ కలెక్టర్ రాకేష్ విద్యార్థులకు సూచించారు.
ఓటరు జాబితా సవరణ ఆవశ్యకతను, ప్రజల భాగస్వామ్యం యొక్క ప్రాముఖ్యతను విద్యార్థులకు తెలియజేశారు.
ఈ అవగాహన కార్యక్రమంలో భాగంగా, ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు వక్తృత్వ పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమానికి తహసీల్దార్ విజయ్ కాంత్ రావు, ఎంపీడీవో లక్ష్మీ కాంత్ రావు, మండల విద్యాశాఖ అధికారి, కళాశాల ప్రిన్సిపాల్ కందూర్ శంకర్, అధ్యాపకులు హాజరయ్యారు.












