శనివారం (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 04
నిర్మల్ పట్టణంలోని లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవరకోట దేవస్థానంలో కృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఘనంగా వేడుకలు నిర్వహించనున్నారు. శనివారం సాయంత్రం 5 గంటలకు దాండియా కార్యక్రమంతో వేడుకలు ప్రారంభమవుతాయని దేవస్థానం చైర్మన్ ఆమెడ నివాస్ తెలిపారు.
శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవరకోట దేవస్థానం – నిర్మల్ భక్తులందరికీ శ్రీ కృష్ణాష్టమి పర్వదిన శుభాకాంక్షలు తేదీ: 05-09-2026 | శనివారం శ్రీ కృష్ణాష్టమి వేడుకలు మన దేవస్థానంలో ఘనంగా నిర్వహించబడును. సాయంత్రం 5:00 గంటలకు దాండియా కార్యక్రమంతో ప్రారంభం గమనిక: ఎవరి కోలాట బృందానికి సంబంధించిన కోలాట కర్రలు వారు స్వయంగా తెచ్చుకోవలెను. శ్రీకృష్ణుని ఉట్టి వేడుకలు భక్తుల సమక్షంలో అత్యంత ఘనంగా నిర్వహించబడును భక్తులందరూ భారీ సంఖ్యలో హాజరై, శ్రీ కృష్ణాష్టమి వేడుకలను విజయవంతం చేసి శ్రీకృష్ణుని కృపకు పాత్రులు కావాలని కోరుతున్నాము. అనంతరం అల్పాహార కార్యక్రమం ఉంటుంది. ఆమెడ శ్రీనివాస్ చైర్మన్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవరకోట దేవస్థానం, నిర్మల్ పాలకవర్గం కార్యనిర్వాహణాధికారి: భూమయ్య ఎక్స్-అఫీషియో మెంబర్: నవీన్ పాలకవర్గ సభ్యులు












