నిర్మల్, 12 July
నిర్మల్ పట్టణంలోని జహురానగర్, ప్రియదర్శిని నగర్, కళానగర్ ప్రాంతాల్లో ప్రధాన రహదారులు అధ్వానంగా మారాయి. ఇటీవల నిర్మించిన సీసీ రోడ్లను కేబుల్ లైన్ల కోసం తవ్వేయడంతో గోతులు ఏర్పడి, వాహనదారులకు ఇబ్బందులు కలుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.
నిర్మల్ పట్టణంలోని జహురానగర్, ప్రియదర్శిని నగర్, కళానగర్ ప్రాంతాల్లో ప్రధాన రహదారులు అధ్వానంగా తయారయ్యాయి. కొన్ని నెలల క్రితం నిర్మించిన సీసీ రోడ్లను కేబుల్ లైన్ల కోసం ఇరువైపులా తవ్వకాలు జరపడంతో మార్గమంతా గోతులతో నిండిపోయిందని స్థానికులు వాపోతున్నారు.
తవ్వకాలు జరిపిన చోట నామమాత్రంగా సిమెంట్ వేసి వదిలేశారని, ప్రస్తుతం వర్షాకాలం కావడంతో ఈ గోతులు వాహనదారులకు తీవ్ర ప్రమాదకరంగా మారాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే మరమ్మతులు చేపట్టి రోడ్లను బాగుచేయాలని వారు కోరుతున్నారు.












