.యధావిధిగా "అడవి దేవులపల్లి"కి బస్సులు నడపాలని ప్రయాణికులు ఆర్టీసీ అధికారికి వినతి :
👉 ఉదయం 8 గంటలకు తప్పనిసరిగా బస్ నడపాలి :
మిర్యాలగూడ ఆగస్టు 18 (మనోరంజని తెలుగు టైమ్స్)
మిర్యాలగూడ ఆర్టీసీ డిపో నుంచి యధావిధిగా ఉదయం 8 గంటలకు అడవిదేవులపల్లికి తప్పనిసరిగా బస్సు నడపాలని కోరుతూ ప్రయాణికులు మంగళవారం ఉదయం ఆర్టీసీ అధికారులకు వినతి పత్రం సమర్పించారు. కొన్ని సంవత్సరాల నుంచి మిర్యాలగూడ నుంచి అడవిదేవులపల్లి మండల కేంద్రానికి ఉదయం 8 గంటలకు బస్సు నడిపే వారని ఇటీవల బస్సు నడిపే సమయాన్ని ఉదయం 8:30 నిమిషాలకు మార్చారని, తద్వారా విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అడవిదేవులపల్లి మండల కేంద్రానికి ఉదయం 8:00 గంటలకు బస్సు నడిపితే మండల పరిధిలోని పాఠశాలలకు ఉపాధ్యాయులు సమయానికి చేరుతారని, బస్సు వేళలు మార్పుకు ఒత్తిడి ఉందని సాకు చెప్పి బస్సు నడిచే వేళలు మార్చడం సరికాదని, అనైతికమని వారు వాపోయారు.అదేవిధంగా అడవిదేవులపల్లి మండల కేంద్రం నుంచి ప్రతి రోజు నడిచే విధంగా సాయంత్రం 4 :20 గంటల వరకు మిర్యాలగూడకు బస్సు నడిచే విధంగా చూడాలని మార్పులు చేసి ఇబ్బందులకు గురి చేయవద్దని వారు అధికారులకు కోరుతున్నారు. ఆర్టీసీ అధికారులు ఏ మేరకు స్పందిస్తారో వేచి చూడాల్సిందే..! ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని బస్సు వేళలు చేసిన మార్పులను ఉపసంహరించుకొని, యధావిధిగా అడవి దేవులపల్లి మండల కేంద్రానికి ఉదయం 8:00 గంటలకు బస్సులు నడిపించేందుకు చొరవ తీసుకోవాలని కోరుతున్నారు.












