నిర్మల్, 16 July
ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులకు అందజేసే ఏకరూప దుస్తుల నాణ్యత విషయంలో రాజీ పడరాదని నిర్మల్ కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులకు స్పష్టం చేశారు. స్కంద ఔట్ ఫిట్ కేంద్రంలో దుస్తుల తయారీని ఆయన పరిశీలించారు.
ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులకు అందించే ఏకరూప దుస్తులు నాణ్యవంతంగా ఉండాలని నిర్మల్ కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు.
పట్టణంలోని స్కంద ఔట్ ఫిట్ కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అందించే ఏకరూప దుస్తుల తయారీ తీరును కలెక్టర్ పరిశీలించారు.
దుస్తుల తయారీకి సంబంధించి వివరాలను అడిగి తెలుసుకున్న ఆయన, విద్యార్థులకు అందించే దుస్తులు నాణ్యవంతంగా ఉండాలని సూచించారు.












