నిర్మల్, జులై 7
ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరిశుభ్రమైన వాతావరణం కల్పించేందుకు నిర్మల్ పట్టణంలోని నాయుడివాడలో మురికి కాలువల పూడిక తీత పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి ఆదేశాల మేరకు ఈ పనులు చేపడుతున్నారు.
ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, పరిశుభ్రమైన వాతావరణం కల్పించేందుకు మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి ఆదేశాల మేరకు నిర్మల్ పట్టణంలోని నాయుడివాడ ప్రాంతంలో పూడికతో నిండిపోయిన మురికి కాలువల పూడిక తీత పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని చేపడుతున్న ఈ ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం ద్వారా వర్షపు నీరు సాఫీగా ప్రవహించడంతో పాటు, నీటి నిల్వలు, దోమల వ్యాప్తి, అంటువ్యాధుల ప్రమాదం తగ్గేలా చర్యలు తీసుకుంటున్నారు.
పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు మున్సిపల్ యంత్రాంగం నిరంతరం కృషి చేస్తోంది.












